PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెన్నా నదిలో తగ్గని నీటి ఉధృతి..

1 min read

– పెన్నా నది పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తం చేసిన అధికారులు
పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: అనంతపురం. కడప. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలో అతి పెద్ద నది అయిన పెన్నా నది ఉగ్రరూపం దాలుస్తోంది. మైలవరం. గండికోట జలాశయాలు పూర్తిగా నిండిపోవడంతో వేలాది క్యూసెక్కులు వరద నీటిని గేట్ల ద్వారా పెన్నా నది కి పోతున్నారు. కుందు నది. పాపాగ్ని నది నుంచి కూడా వరద నీరు పెన్నా నది లోకి చేరుకుంటుంది. చెన్నూరు వద్ద వరద నీటిని చెన్నూరు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ప్రతి గంటకు నీటి ఉధృతిని పరిశీలిస్తున్నారు. పెన్నా నది ఎగువ భాగంలో ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద వరద నీటిని కేసీ కెనాల్ అధికారులు పరిశీలిస్తున్నారు. చెన్నూరు వద్ద శనివారం సాయంత్రానికి 82, వేలు క్యూసెక్కులు వరద నీరు దిగనున్న సోమశిల ప్రాజెక్టు లోకి పరుగులు పెడుతున్నది. చెన్నూరు మండలం లో పెన్నా నది పరిసర గ్రామ ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన పంటలు నీట మునిగాయి. సంబంధించిన బోరు పైపులు నీటిలో కొట్టుకు పోయాయి. చెన్నూరు వద్ద భారీగా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామాల వద్ద వీఆర్వోలు. కార్యదర్శులు. గ్రామ సచివాలయ ఉద్యోగులు. వీఆర్ఏలు ను అధికారులు అప్రమత్తం చేశారు. పెన్నా నది లో ఎవరు దిగకుండా నిఘా ముమ్మరం చేశారు.

About Author