NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

(ఎస్‌ఎస్‌సీ) .. ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ అవిష్కరణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు :  ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ద్వారా నిర్వహించబడుతున్న 10వ తరగతి (ఎస్‌ఎస్‌సీ) మరియు ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను సోమవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ లండ సుధాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ లండ సుధాకర్  మాట్లాడుతూ, విద్యను మధ్యలో నిలిపివేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు మరియు ఇతర ఆసక్తి గల అభ్యర్థులు APOSS అందిస్తున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల ద్వారా తమ విద్యను కొనసాగించి అర్హతలను మెరుగుపరుచుకునేందుకు అవకాశం కల్పించబడిందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా సమీప APOSS అధ్యయన కేంద్రంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ACGE శ్రీ హెచ్. గోవింద నాయక్ , డిప్యూటీ డీఈవో  శ్రీధర్ బాబు , అసిస్టెంట్ డైరెక్టర్లు  ఎం. అసదుల్లా ఖాన్ ,  కే. నాగభూషణం, జిల్లా ఉర్దూ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె.ఎస్. ఆదం భాష, DCEB సెక్రటరీ శ్రీ నాగరాజు, ఏఎస్ఓ  పి. లక్ష్మీనారాయణ  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *