ఉర్దూ పాఠశాల…విలీనంతో విద్యార్థుల ఇక్కట్లు
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైనచెన్నూరు మైనార్టీ కాలనీ చక్కెర చెట్టువద్ద ఉన్నఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు 200 మంది విద్యార్థులతో కళకళలాడిన పాఠశాల నేడు దీనావస్థలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మూడవ తరగతి నుంచి ఉన్నత పాఠశాలకు విలీనం చేయడంతో కొన్ని పాఠశాలలో మూతపడే స్థాయికి వచ్చాయి. ఇందులో భాగంగా చెన్నూర్ లో మైనార్టీ కాలనీలో ఉన్న ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల విలీనంతో ప్రస్తుతం ఒకటి రెండు తరగతులకు కేవలం 23 మంది విద్యార్థులు మిగిలిపోయారు.విలీనంకు ముందు వంద మందికి పైగా ఉన్న విద్యార్థులు చెన్నూరు జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ ఉన్నత పాఠశాలకు మూడో తరగతి నుంచిఏడవ తరగతి వరకు విలీనం చేశారు. విద్యార్థులు ఉర్దూ ఉన్నత పాఠశాలకు వెళ్లినప్పటికీ అక్కడ మౌలిక సదుపాయాలు లేవు చెట్లు కింద నిర్మాణంలో ఉన్న భవనంలో క్రింద కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉర్దూ పాఠశాలలో ఐదు మంది ఉపాధ్యాయులుఉండగా విద్యార్థులతోపాటు ముగ్గురు ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలకు పంపించారు. ఎన్నో ఏళ్ళు చరిత్ర కలిగిన ఉర్దూ పాఠశాల తరగతి గదులు మరుగుదొడ్లు అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఇక్కడున్న తరగతులను ఉన్నత పాఠశాలకువిలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులనుంచి సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ఉర్దూ పాఠశాలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం నాడు నేడు కింద 21 లక్ష రూపాయలు మంజూరు చేసింది. కానీ ఒకటో తరగతి తరగతిలో కూడా విద్యార్థులసంఖ్య తగ్గిపోయింది.ప్రస్తుతం 23 మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు మిగిలారు. ఇప్పటికైనా ఐదవ తరగతి వరకైనా ఇక్కడ ఉర్దూ పాఠశాల ఉండేవిధంగా చర్యలుతీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.