బ్యాలెట్లు వాడండి.. లేదంటే నా చావుకు అనుమతించండి !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో జరిగే ఎన్నికలకు ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లను వాడాలని చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ డిమాండ్ చేశారు. ఓటర్లను జాగృతం చేసే రాష్ట్రీయ మత్ దాతా జాగృతి మంచ్
అధ్యక్షుడిగా నందకుమార్ పనిచేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. ఈ డిమాండ్ అంగీకరించకపోతే తన అనాయాస మరణానికి అనుమతివ్వాలని కోరారు. పౌరుల రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలన్ని నాశనమవుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవస్థలో తనకు బతకాలని లేదని, తన రాజ్యాంగ హక్కులకు రక్షణ లేదని ఆయన పేర్కొన్నారు. ఓటరు దినోత్సవం అయిన జనవరి 25న తన మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.