ఏపీలో ఉత్తరప్రదేశ్ తరహా పాలన రావాలి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువైపోయాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపల్లె,విజయవాడలో జరిగిన ఘటనలు దిగ్భ్రాంతికి గురి చేశాయన్నారు. యూపీలో నేరస్తులను యోగి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తుందన్నారు. యూపీ తరహా పాలన ఏపీలో ఉండాలని చెప్పారు. ఏపీలో గంజాయి విస్తృతంగా దొరుకుతుందని, మాదక ద్రవ్యాలు వినియోగించే వారిని వైసీపీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.