PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాడవాడలా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవల వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా హేలాపురి నగరంలో వాడవాడలా శ్రీ శ్రీ రామ నవమి మహోత్సవ వేడుకలు ప్రభుత్వ నిబంధనలతో శ్రీరామ కళ్యాణ మహోత్సవ వేడుకలు నగరంలో జరుపుకోవడం జరిగింది. స్థానిక అమీనా పేట ఉప ఎలక్ట్రికల్ భవనం నందు ఎలక్ట్రికల్ ఉద్యోగుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 2006 సంవత్సరo నుండి నేటి వరకు ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తునట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవం లో ఎస్ఇ దంపతులు సీతారామ వివాహ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి వస్త్ర మరియు తలంబ్రాలు కుటుంబ సమేతంగా శ్రీ స్వామివారి దంపతులకు సమర్పించారు. అనంతరం భారీ అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పి శశిధర్, బి వి కృష్ణంరాజు, మహేష్ మరియు పర్యవేక్షకులు కెఎస్ఎన్ మూర్తి చీఫ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. అశోక్ నగర్ మరియు పత్తే బాధ లో శ్రీ దాసాంజనేయ ఆలయంలో శ్రీరామ నవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకుని మ్రొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా పర్యవేక్షించారు. అమీనా పేట ఏటిగట్టు ప్రాంతంలో శ్రీ రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన పానకాన్ని , వడ పప్పు బెల్లం ప్రసాదాలను విచ్చేసిన భక్తులకు బాటసారిలకు అందజేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కార్యక్రమాలను పర్యవేక్షించారు. అమీనాపేట కోదండ రామాలయంలో శ్రీరామ కళ్యాణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అశేష మంది దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు. భక్తులు కూడా కల్యాణంలో పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీనిలో భాగంగా చోడవరపు వెంకటేశ్వరరావు దంపతులు శ్రీ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని పలు దేవాలయాలను దంపతులు ఇరువురు సందర్శించి పూజలు చేసి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు మొక్కులు తీర్చుకున్నారు. ఏలూరు మెయిన్ బజార్ చాపల మార్కెట్ సెంటర్ లో శ్రీ అభయాంజనేయ ఆలయంలో ఫిషరీస్ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి 42వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలను తిలకించడానికి వై ఎస్ ఆర్ సి పి పార్టీ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని దర్శించి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొన్నారు. అలాగే ఏలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి విచ్చేసి స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పిళ్ళo గోళ్ల శ్రీలక్ష్మి , కార్పొరేటర్ శ్రీదేవి, నిర్వహకులు వారికి శాలువాలు కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో చింత రాజు, మాణిక్యాలరావు, ఉక్కు సూరి గోపాలకృష్ణ, ఎంబీఏ రాజు, రాజా, మురళీకృష్ణ ,ఉమా, చింత సుబ్బారావు, దేవరపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author