వడ్డెరలకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వాలి..
1 min read-వడ్డెర్లకు ఓటు బ్యాంక్ చైతన్యవంతం చేస్తాం: చక్రధర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్రంలో వడ్డెరలకు శాసనసభ మరియు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయుటకు సీట్లు ఇవ్వాలని నంద్యాల జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు చక్రధర్ అన్నారు.ఆదివారం మధ్యాహ్నం కడప జిల్లా పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేసిన గ్రేటర్ రాయలసీమ వడ్డెరల మేదో మదన సదస్సు జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులివెందుల మున్సిపల్ చైర్మన్ వడ్డె వర ప్రసాద్ హాజరయ్యారు.అదేవిధంగా ఎమ్మెల్సీ ఏసు రత్నం,నంద్యాల జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు చక్రధర్ మరియు సంఘం రాష్ట్ర నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర ప్రాథమిక హక్కులు నెరవేర్చాలని వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.అంతేకాకుండా క్వారీలపై వడ్డరులకు హక్కులు కల్పించడంతో పాటుగా ప్రభుత్వ ఇన్సూరెన్స్ భీమా ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.45 సంవత్సరాలు దాటిన వడ్డరులకు పింఛన్ మంజూరు చేయుటకు తగిన చర్యలు చేపట్టాలని,వడ్డెర విద్యార్థులు చదువుతున్న వారికి ఉచిత విద్యను ఏర్పాటు చేయాలని వారు అన్నారు.రాష్ట్రంలో వడ్డెర్ల జనాభాపై జన గణన పూర్తి చేయాలని రాష్ట్రంలో వడ్డెరలకు ఓటు బ్యాంక్ ఉందనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలని రాబోయే రోజుల్లో వడ్డర్లకు ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయుటకు అవకాశం కల్పించాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.అంతేకాకుండా జిల్లాలో ఉన్న వడ్డెరలను చైతన్యవంతం చేస్తూ చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని నంద్యాల జిల్లా అధ్యక్షుడు చక్రధర్ అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి నాయకులు పాల్గొన్నారు.