PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మానవత్వం చాటుకుంటున్న వైకాపా నాయకులు

1 min read

– మృతి చెందిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో ఎస్సి కాలనీకి చెందిన వెంకటయ్య అనే వైకాపా కార్యకర్త అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మృతిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన ఆదేశాల మేరకు వైకాపా నాయకులు శనివారం రవీంద్ర నాయుడు, శేఖర్ నాయుడు, పాపన్న ఆర్థిక సాయం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరు గ్రామంలో పేద కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు తన వంతుగా ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

About Author