వాల్మీకి బోయ సేవా సంస్థ నూతన కమిటీ..
1 min read
పల్లెవెలుగు వెబ్: వాల్మీకి బోయ సేవా సంస్థ వ్యవస్థాపక మరియు గౌరవ అధ్యక్షులు కుబేరస్వామి ఆధ్వర్యంలో అసిసోసియేట్ అధ్యక్షులు మండ్ల వీర వసంత్ అధ్యక్షతన అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తలారి కృష్ణ నాయుడు, అసోసియేట్ అధ్యక్షులుగా మండ్ల వీర వసంత్, ప్రధాన కార్యదర్శి గా బొగ్గుల ఈరన్న, కోశాధికారిగా బోయ శివన్న, ఉపాధ్యక్షులుగా డా రాఘవేంద్ర రావు, రేముడూరు శ్రీనివాసులు, యల్. వెంకటేశ్వర్లు, రేవుల శ్రీనివాసులు, టి. క్రిష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శలుగా జి.నాగరాజు, జగన్నాథం, కోసిగి నాయుడు, యమ్.శ్రీనివాసులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు గా బి.శంకర్, మీనిగ రవి ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన తలారి కృష్ణ నాయుడు మాట్లాడుతూ సంస్థ ద్వారా వాల్మీకులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామన్నారు మరియు మెడికల్ క్యాంపు లు , సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో వాల్మీకి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.