PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు

1 min read

– డిస్టిక్ గవర్నర్ డా : కె పంక జాక్షన్ కు ఘన సన్మానం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ ద్వారా డిస్ట్రిక్ గవర్నర్ డా॥వి కె పంకజాక్షన్ అధికార పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించటమైనది.ఈ కార్యక్రమం బుధవారం ఉదయం 8గo మొదలై గోసంరక్షణాలయం నందు గోవులకు ఆహారాన్ని మురళీ కృష్ణ వారి ఆర్ధిక సహాకారం తో పంపిణి చేసారు. ప్రసిడెండ్ అబ్రహాం లింకన్ ఆర్దిక సహకారంతో వారి గృహం వద్ద 40 మంది వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసారు.పోణంగి పాఠశాల ఆవరణను రూ 1,30,000 కాంక్రీట్ గచ్చుతో ట్రేస్ ఇండియా చైర్మన్ యాంజిలో దిడ్ల వారి ఆర్ధిక సహకారంతో చేయించిన దానిని డిస్ట్రిక్ట్ గవర్నర్ వికే పంజాక్షన్ ప్రారంభించినారు.పోణంగి గ్రామస్తులకు,విద్యార్ధులకు కళ్ళు పరీక్షించి ఉచితంగా 19 మందికి స్మార్ట్ సిటి లయన్స్ క్లబ్ ఆర్ఢిక సహకారంతో కళ్ళజోళ్ళను వి.కే.పంకజాక్షన్ గారి చేతులమీదుగా పంపిణీ చేయటమైనది.జ్యోతీరావ్ పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి పూలే మరియు అంబేడ్కర్ పై నిర్వహించిన చిత్రలేఖన పోటీలలో గెలుపోందిన వారికి ప్రధమ ద్వితీయ బహుమతులను అందించటమైనది. పోణంగి ప్రాధమిక,ఉన్నత పాఠశాల,యం ఆర్ ఆర్ కాలనీ పాఠశాల ల విద్యార్ధులకు రీడింగ్ యాక్షన్ కార్యక్రమంలో భాగంగా విజియం విఆర్ కృష్ణారావు ఆర్దిక సహకారంతో 35 పుస్తకములు ను ఆయా పాఠశాల ఉపాధ్యాయులకు అందించటమైనది.ఏవిఆర్ విజ్ఙాన కేంద్రం వారు నడుపుతున్న ట్యూషన్ సెంటర్స్ కు రీడింగ్ యాక్షన్ కార్యక్రమం ననుసరించి మూడు సెట్ల గ్రంధాలయ పుస్తకములను అందించటమైనది. ప్రభుత్వ ఐ.టి.ఐ./జిల్లాస్థాయి శిక్షణాకేంద్రానికి లయన్స్ క్లబ్ ప్రసిడెంట్ అబ్రహాం లింకన్ తండ్రి జ్ఞాపకార్ధం యల్.సి.డి ప్రొజెక్టర్ పంపిణీ చేయటమైనది. సత్రంపాడు పాత పెట్రోల్ బంకు దగ్గరలో చలివేంద్రం ఏర్పాటు చేయటమైనది. ఈ చలివేంద్రంలో వారంలో రెండురోజులు మజ్జిగ, ఒకరోజు సుగంధి మిగిలిన రోజులు కూలింగ్ మంచినీరు మే 30 వతేదీ వరకు అందించే ఏర్పాటుచేస్తూ ఈరోజు ప్రారంభిచటమైనదని ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం స్మార్ట్ సిటీ లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కె పంకజక్షన్ కు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. స్మార్ట్ సిటీ లైన్స్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేసి 2022 జూలై నుంచి ఈరోజు వరకు చేసిన పలు సేవా కార్యక్రమాలను సమీక్షంచటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా నాయుకులు వి.వి.స్వామి, లేళ్ళ వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ ఎన్. నాగమల్లేశ్వరరావు, జిల్లా చైర్మన్ మురళీ కృష్ణ,ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, కార్యదర్శి మార్గాని శ్రీనివాసరావు,కోశాధికారి షేక్ ముస్తఫా అలీ,సభ్యులు బి. సురేంద్ర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె రాంబాబు, ఉపాధ్యాయులు కె దేవీప్రసాద్, సిజేఏ స్టీవెన్,జీఏ స్వామి, గోపాల్ గణేష్, కె.శ్యామలా దేవి, కృష్ణవేణి, సంతోషమ్మ , సుధారాణి, శ్రీనివాస్, జాన్ వెస్లీ, జె. పెంటయ్య తల్లిదండ్రులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

About Author