వసంత పంచమి.. గణతంత్ర దినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు శివారులోని విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాలలో 26వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పి పి గురుమూర్తిగారి అధ్యక్షతన వైభవంగా జరిగింది. అంతకు ముందుగా మాఘ శుద్ధ పంచమి వసంత పంచమి సందర్భంగా సరస్వతీ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. కొట్టే చెన్నయ్య గారు పాల్గొన్నారు. శ్రీ చెన్నయ్య గారు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ భారతీయులు ఎప్పటికీ బానిసలు కారని, వారిలో సతత సంఘర్షణ, పోరాటపటిమ ఉండడం వల్లే స్వాతంత్రం ఫలాలను చక్కగా అందిపుచ్చుకొని ప్రపంచంలో మేటిగా ముందుకు దూసుకుపోతున్నారని అన్నారు.పాఠశాల కోశాధికారి శ్రీ మాణిక్య రెడ్డి గారు, ప్రధానోధ్యాయులు వ్యాస రాజ్, శ్రీ సుదర్శన్ రావు, శ్రీ రణధీర్ రెడ్డి శ్రీ ఎస్ రామిరెడ్డి , శ్రీ ఆర్ నాగేశ్వర్ రెడ్డి , శ్రీమతి స్వర్ణ లత శ్రీ వంశీ రాఘవ, శ్రీ మతి మీనా, శ్రీ రాజశేఖరరెడ్డి,తదితరులు , విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మాళిగి వ్యాస రాజ్ , ప్రధానోపాధ్యాయులు, విజ్ఞాన పీఠం ఉన్నత పాఠశాల , Gpr Nagar, కర్నూలు.