త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు
1 min read
పత్రాలు లేని వాహనదారులకు, హెల్మెట్ ధరించని వారికి కౌన్సిలింగ్,ట్రాఫిక్ పై అవగాహన
త్రీ టౌన్ సిఐ కోటేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద వాహనాల చెకింగ్ నిర్వహించారు ఇందులో భాగంగా సరైన పత్రాలు చూపించని వాహనదారులకు మరియు హెల్మెట్ ధరించని, లైసెన్స్ లేని వారికి చలానాను విధించడంతోపాటు,హెల్మెట్ లేనివారికి కొత్త హెల్మెట్లను ధరింప చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు,ఎస్ఐ రాంబాబు ఎస్ఐ అప్పారావు మరియు ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్ మరియు సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు.

