ఎంపీహెచ్ఏ సుగుణమ్మకు పదోన్నతి..
1 min read
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపిహెచ్ఏ-ఎఫ్ గా పనిచేస్తున్న ఎం.సుగుణమ్మ హెల్త్ సూపర్ వైజర్ గా పదోన్నతి పొందారు.కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కౌన్సిలింగ్ లో దేవనకొండ మండలం తెర్నేకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ పదోన్నతిగా నియమిస్తూ అధికారులు మూమెంట్ ఆర్డర్ ను ఆమెకు అందజేశారు.కడుమూరు పిహెచ్ సీలో 7.7.2016న చేరిన ఆమె చింతలపల్లె, కాజీపేట,దేవనూరు, సున్నంపల్లి గ్రామాల్లో పది సంవత్సరాల పాటు ఇక్కడ పని చేశారు.పదోన్నతి పొందిన సందర్భంగా ఆమె మిత్రులు శ్రేయోభిలాషులు బుధవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు.


