ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్ పక్కాగా జరగాలి
1 min read– కమలాపురం నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్టర్ అధికారి చంద్రమోహన్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బిఎల్వోలు, సూపర్వైజర్లు, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి, అందులో ఓటర్ లిస్టులో పేరు డిలీట్ అయినవారిని గుర్తించి వారికి ఓటు హక్కు కలిగే విధంగా చర్యలు చేపట్టాలని, కమలాపురం నియోజకవర్గం ఎలక్ట్రోల్ రిజిస్టర్ అధికారి చంద్రమోహన్ అన్నారు, శుక్రవారం ఆయన మండల తాసిల్దార్ కార్యాలయంలో బి ఎల్ వో లు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బి ఎల్ ఓ లు, సూపర్వైజర్ లు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మరణించిన వారి ఓట్లు అలాగే 18 సంవత్సరాలు నిండిన ఓట్లను గ్రామస్తులు చెప్పినప్పుడు విని వాటిని నిర్ధారణ చేసుకొని మార్పులు చేర్పులు చేపట్టాలని తెలిపారు, 2024 కు సంబంధించి ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులు అలాగే తొలగింపులు, ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్ కు ఓటు బదిలీ వంటి వాటిని పక్కాగా నిర్వహించాలని, వాటిల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన బిఎల్ఓ ల కు తెలియజేశారు, దీనికి సంబంధించి బి ఎల్ వో లు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది, జాగ్రత్తగా ఎలాంటి అవకతవకలకు, ఒడిదుడుకులకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ఓటర్లకు సంబంధించిన దరఖాస్తులు ఏరోజుకారోజు పరిశీలించాలని ఆయన తెలిపారు, అలాగే మండల వ్యాప్తంగా ఉన్న 36 పోలింగ్ స్టేషన్లను పరిశీలించి అక్కడ ఏవైనా సమస్యలు, త్రాగునీటి సమస్య, ఫర్నిచర్, కరెంటు సమస్యలు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు, అలాగే పోలింగ్ స్టేషన్ల లో ర్యాంప్, వికలాంగులకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా చూడాలని ఆయన తెలిపారు, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన ఓటర్ల లిస్ట్ పక్కాగా ఉండాలని ఇందులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మహమ్మద్ పటాన్ అలీ ఖాన్, డిప్యూటీ తాసిల్దార్, బి ఎల్ వో లు, సూపర్వైజర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.