విక్టరీ థియేటర్ సీజ్..!
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు కార్పొరేషన్ : నగరంలోని ఎర్రబురుజు ప్రాంతంలో ఉన్న విక్టరీ థియేటర్ ను ఆదివారం నగర పాలక అధికారులు సీజ్ చేశారు. థియేటర్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, మాస్క్ లేకపోయినా ప్రేక్షకులను అనుమతించడం, శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచకపోవడం నగర పాలక కమిషనర్ డీకే బాలాజి యాజమాన్యంపై మండిపడ్డారు. అధికారులు వచ్చాక ప్రేక్షకులకు మాస్క్ ధరించాలని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం నగర పాలక ప్రజారోగ్య విభాగం అధికారులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు అందజేసి సీజ్ చేయడం జరిగింది. తనిఖీల్లో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు ఉన్నారు.