నారా లోకేష్ పై విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేష్ అడవుల్లో నివసించే ఆది మానవుల ప్రవర్తన.. అసభ్యకరమైన భాషలు మాట్లాడితే ప్రజలు హర్షించరని తెలిపారు. ‘లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా… ఈ సమాజంలో పుట్టాడా.. అమెరికాలో ఎంబీఏ చదివాడా.. ఇవన్నీ బోగస్ డిగ్రీలా.. నీకేమైనా మతి భ్రమించింది’ అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. 2024కి తెలుగుదేశం పార్టీ ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీలోని పెద్ద పెద్ద నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని… చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంతర్థానమై పోతుందని అన్నారు. అనంతపురం, కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ చేస్తోందని ఆరోపించారు.