మోడీ ఫిట్నెస్ మంత్ర జయప్రదం చేయండి…
1 min read
సన్నద్ధత .. యోగ శక్తి సాధనా సమితి
విజయవాడ, న్యూస్ నేడు : 2025 అంతర్జాతీయ యోగా ఉత్సవాలలో భాగంగా చేపట్టనున్న ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన పెంపొందించడానికి చేపట్టనున్న కార్యక్రమాలకు సాయం చేయటానికి విజయవాడ పోలీస్ తన ప్రాథమిక సన్నద్ధతను ప్బ్రోచర్ ఆవిష్కరించడం ద్వారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మిన్ ) కె. జి. వి సరిత ఐ.పీ.ఎస్ తెలియజేసారుఅని యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.గంట పాటు జరిగే ఈ అవగాహన సదస్సులు లో ప్రపంచవ్యాప్తంగా యోగా ఆవశ్యకతను తెలియజెప్పి,భారత ప్రధాని మోడీ ఫిట్నెస్ మంత్రతో రోగాలను, రుగ్మతల నుంచి బయటపడ్డానికి సమాజాన్ని సన్నద్ధం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేస్తున్నారు.ఇందులో భాగంగా ప్రాణ శక్తిని పెంచే లాగా ఉత్తమ ప్రాణాయామ విధానాలను నేర్పటం,ఆక్యుప్రెషర్ హ్యాండ్ స్టిక్ ఉపయోగించే విధానం, వచ్చే బెనిఫిట్స్ తెలియజేయబడతాయని అలాగే బేర్ ఫుట్ వాక్కు ద్వారా ఫుట్ రిఫ్లెక్సాలజీ గురించి చెప్పి వచ్చే బెనిఫిట్స్ ని తెలియజేయబడతాయని,ఆసనాలు, ఎక్సర్సైజెస్ తరువాత అంతర పంచభూతాలను సమస్థితికి తీసుకు రావలసిన అవసరాన్ని తెలియజేసి తీసుకొచ్చే విధానం రుగ్మతలను తగ్గించుకునే లాగా ఇక ముందు రోగాలు,రుగ్మతుల బారిన పడకుండా ఎవరికి వారే చికిత్స చేసుకునే లాగా సమాజాన్ని తయారు చేయడానికి మోడీ ఫిట్నెస్ మంత్ర ఉపకరిస్తుంది అని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలియజేస్తున్నారు.