బొల్లవరంలో గ్రామోత్సవం…
1 min read
మహానంది, న్యూస్ నేడు: మండలంలోని బొల్లవరం గ్రామంలో కార్తీక సోమవారం సందర్భంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పార్వతి పరమేశ్వర, లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తులను భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

