పుల్లయ్య కళాశాల డీన్ కు ప్రతిష్టాత్మక ‘జ్యేష్ఠ ఆచార్య’ అవార్డు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో డీన్ ఇన్నోవేషన్స్ గా పనిచేస్తున్న డాక్టర్ సి. రంజిత్ కుమార్ కు ప్రతిష్టాత్మక ‘జ్యేష్ఠ ఆచార్య’ పురస్కారం లభించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న “బ్రెయినోవిజన్” సంస్థ ప్రతి సంవత్సరం పరిశోధన మరియు నూతన ఆవిష్కరణల రంగంలో ప్రసిద్ధి చెందిన యువ శాస్త్రవేత్తలకు ఈ అవార్డు అందజేస్తుంది. ఈ సంవత్సరం డాక్టర్ రంజిత్ కుమార్ కు ఈ రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుని ఇస్తున్నట్లు ఆ సంస్థ ముఖ్య కార్యదర్శి డి.గణేష్ పేర్కొన్నారు.వీరికి పరిశోధన రంగంలో అపారమైన అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సి. రంజిత్ కుమార్ ను కళాశాల చైర్మన్ జి.వి.యం. మోహన్ కుమార్ గారు అభినందించారు. సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కారణమయ్యే పరిశోధనలకై , తమ సంస్థల్లో పని చేసే అధ్యాపకులు పరిశోధనల వైపు ముందుకు సాగుతామంటే మా వంతు సహాయంగా వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ, ప్రపంచ పరిశోధనా రంగంలో భారతదేశం అగ్రగామిగా నిలవాలన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు,డీన్ అడ్మిన్ డాక్టర్ ఎం. గిరిధర్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతలను మరింత పెంచిందని, మున్ముందు ఇంకా కృషి చేస్తానని తనకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

