దోమ కాటు ద్వారా మలేరియా, డెంగు, చికెన్ గునియా .. వైరల్ జ్వరాలు
1 min read
నీరు కలుషితం వలన టైఫాయిడ్, కామెర్లు, నీళ్ల విరోచనాలు మొదలగు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది
అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు సూచన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అన్ని కాలాల్లో కంటే వర్షాకాలంలో ప్రజలు అంటువ్యాధులుతో ఎక్కువగా బాధపడే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు పరిసరాలు పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు గొల్లాయిగూడెం పరిధిలో సుబ్రహ్మణ్యం కాలనీలో ” వర్షాకాలంలో సంభవించే వ్యాధులపై అవగాహన కల్పిస్తూ సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వర్షం నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండటం వలన దోమలు ఎక్కువగా వృద్ధి చెంది దోమ కాటు ద్వారా మలేరియా, డెంగు, చికెన్ గునియా మొదలగు వైరల్ జ్వరాలు, నీరు కలుషితం వలన టైఫాయిడ్, కామెర్లు, నీళ్ల విరోచనాలు మొదలగు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి దోమల నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం చాలా కీలకంగాబట్టి ప్రజలు వారానికి ఒకసారిఫ్రైడే డ్రై డే ఆచరించి నీటి నిల్వ ప్రాంతాలైన నీళ్ల తొట్టెలు డ్రమ్ములు రుబ్బురోలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని మూతలు పెట్టుకోవాలని, నీటి నిల్వ ప్రాంతాల్లో మట్టి పూడ్చి చదును చేసుకోవాలని కుదరని పక్షంలో వాడేసిన ఇంజన్ ఆయిల్ చల్లాలని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడితే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించాలని అక్కడ అన్ని పరీక్షలు మందులు ఉచితంగా అందజేస్తారని సూచించారు అనంతరం ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ మేక శ్రీనివాసరావు,సురేషు, రమేష్,హనుమంతు ఆరోగ్య కార్యకర్తలు ఆదిలక్ష్మి,నీలిమ, జైనాభి, హసీనా ఆశ కార్యకర్తలు దేవి,దుర్గ, మహాలక్ష్మి , పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


