NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు భూ భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

1 min read

“: వసంతవాడ-2 లో రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

రైతన్నలకు పారదర్శకంగా రాజముద్రతో కూడిన 400 పైగా నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు నేడు అందజేత

గత పాలకుల ప్రచార పిచ్చికి స్వస్తి పలికి రాజముద్రతో రైతులకు ఆత్మగౌరవం తెచ్చిన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రైతుల భూములకు శాశ్వత భద్రత, చట్టబద్ధమైన హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దెందులూరు శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. సోమవారం పెదపాడు మండలం వసంతవాడ-2 పరిధిలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మీ భూమి మీ హక్కు’ విధానంలో ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన స్థానిక రైతులకు పంపిణీ చేశారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ట్రైనీ కలెక్టర్ మరియు పెదపాడు మండల ఇన్చార్జి తాసిల్దార్ శ్రవణ్ కుమార్ రెడ్డి, IAS , రెవెన్యూ యంత్రాంగం, కూటమి నాయకులు మొక్కలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ—గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల భూ రికార్డులపై, పట్టాదారు పాస్ పుస్తకాలపై స్వప్రయోజనాల కోసం వ్యక్తిగత బొమ్మలు వేయించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారనీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆ విధానాన్ని రద్దు చేసి, గౌరవప్రదమైన ప్రభుత్వ అధికారిక రాజముద్రతో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ కొత్త పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మరియు పెదపాడు ఇంచార్జ్ తహసిల్దార్ శ్రవణ్ కుమార్ రెడ్డి ,ఐ ఎ ఎస్ , దెందులూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారపాటి రామసీత, జిల్లా టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు మారడాని రవి,  క్లస్టర్ ఇంచార్జ్ గుత్తా అనిల్, కూటమి నాయకులు మోరు దశరథ్, మేడికొండ కుటుంబ శాస్త్రి, పోలుపర్తి కన్నారావు , పెద్దిరెడ్డి రమేష్, నూకల నాగేశ్వరరావు సహా పలువురు కూటమి నాయకులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *