NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమగ్ర విద్యా సాంకేతిక కేంద్రంగా ” వర్చువల్ స్టూడియో”

1 min read

కెరీర్ గైడెన్స్ వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు కోచింగ్ కేంద్రంగా ఉండాలి.

జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా

పల్లెవెలుగు , కర్నూలు: నగరంలోని వర్చువల్ స్టూడియోను సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు. గురువారం ఎస్బిఐ కాలనీలోని వర్చువల్ స్టూడియో ను జిల్లా విద్యాధికారి ఎస్. శ్యామ్యూల్ పాల్ తో సందర్శించిన ఆయన పలు సూచనలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని వర్చువల్ స్టూడియోను సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు. వేసవిలో కంప్యూటర్ శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని శిక్షణకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంస్థతో అనుసంధానం చేసి నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ లో పరిజ్ఞానం అందించే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందని అన్నారు. ఇందులో కోర్సు చేసిన వారికి స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సర్టిఫికెట్ అందిస్తుందని అన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు వేసవి సెలవులను వినియోగించుకునేలా కోర్సులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వేసవిలో నిర్వహించాల్సిన తరగతులను, కోర్సులను, వాటి కాలపరిమితి అంశాలను పొందు పరచాలన్నారు . వీటితో పాటు  కెరీర్ గైడెన్స్ వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు కోచింగ్ కేంద్రంగా ఉండాలన్నారు. వాటికి సంబంధించిన ఆడియో,  వీడియో విజువల్స్  అన్నింటిని సిద్ధం చేసి ఉంచాలన్నారు. ఈ విద్యా, ఉద్యోగ సాధనకు సాంకేతిక కేంద్రంగా పనిచేస్తుందని అన్నారు. వీటికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని డీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు.

About Author