పది ఫలితాల్లో విశ్వశాంతి మండల టాపర్
1 min readపల్లెవెలుగు వెబ్ ఆళ్లగడ్డ : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఆళ్లగడ్డ పట్టణంలోనీ విశ్వశాంతి హై స్కూల్ కు చెందిన ఊర్మిక 600/589 మార్కులు సాధించి ఆళ్లగడ్డ మండల టాపర్ గా నిలిచింది. భూమా తేజస్వి 582, అంబటి ప్రణీత 581, ఈడిగే వెంకట కిరణ్ 580, నారాయణ మధు హారిక 579, నారాయణ నాగస్రావ్య 575 మార్కులు సాధించారు. పాఠశాలలో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ శ్రీనాథ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో…..పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల చెందిన అల్లాడి నందిని 600/565 మార్కులు సాధించిందన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ శోభా వివేకవతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అయినా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల చెందిన అల్లాడి నందిని అనే విద్యార్థిని 565 మార్కులు సాధించి ఆళ్లగడ్డ మండల టాపర్గా నిలిచిందన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో విశ్వశాంతి హై స్కూల్ కు చెందిన ఊర్మిక 600/589 సాధించి మండల టాపర్గా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా మండల టాపర్లు ఇచ్చిన విద్యార్థులు ఊర్మిక, నందిని ఇరువురు విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అభినందించారు.