వివేకా హత్య కేసు.. నార్కో పరీక్షలకు అనుమతి నిరాకరణ
1 min readపల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ కు నార్కో పరీక్షలకు కోర్టు అనుమతి నిరాకరించింది. నార్కో పరీక్షల అనుమతి కోసం సీబీఐ అధికారులు పది రోజుల క్రితం జమ్మలమడుగు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై ఇప్పటికే రెండు సార్లు విచారణ వాయిదా పడింది. కడప జైలు నుంచి సునీల్ యాదవ్ వర్చువల్ గా మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. నార్కో పరీక్షలు నిర్వహించాలంటే.. కోర్టు అనుమతితో పాటు.. పరీక్ష చేయించుకునే వ్యక్తి అనుమతి కూడ అవసరం. నార్కో పరీక్షలకు సమ్మతమేనా అని మేజిస్ట్రేట్ అడగడంతో సునీల్ యాదవ్ సమ్మతం కాదని చెప్పారు. దీని పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ ను తిరస్కరించింది.