PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడపగడపను బహిష్కరించిన వాలంటరీలు

1 min read

– వాలంటరీలను కట్టడిచేసిన వైసీపీ మరో వర్గం నాయకులు..
– వెనుదిరిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే ఆర్థర్..
– జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే..
– వాలంటరీల తొలగింపునకు రంగం సిద్ధం..?
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. అది ఎంతవరకు అంటే ప్రభుత్వం చేపట్టిన గడపగడప కార్యక్రమాని బహిష్కరణ వరకు చేరింది. వైసీపీ పార్టీకి చెందిన మరో వర్గం నేత అనుచరులు ఎమ్మెల్యే ఆర్థర్ కు సహకరించడం లేదు.తాజాగాపగిడ్యాల మండలం నెహ్రూనగర్ లో గడపగడప కు మన ప్రభుత్వం కార్యక్రమాని గ్రామ వాలంటరీలు బహిష్కరించి విధులకు హాజరు కాకపోవడంతో గడపగడప కార్యక్రమం వాయిదా పడింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ పార్టీకి చెందిన మరో వర్గం నేత అనుచరులు వాలటరీలను గడపగడప కు రాకుండా కట్టడిచేసిన సంఘటన మండలంలో పెను దుమారం రేపుతోంది. దీనితో ఎమ్మెల్యే ఆ గ్రామం నుంచి వెళ్లిపోయారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలో సచివాలయం 1 పరిధిలో గురువారం గడపగడప కు మన కార్యక్రమం వెళ్లారు. ఎంపీడీఓ కు సమాచారం అందించారు. ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే ఆర్థర్ నెహ్రూనగర్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే ఆర్తర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామానికి వెళ్తే గ్రామ వాలంటీర్లు ఎవరూ రాకపోవడంతో సచివాలయంలో వాలంటీర్ల కోసం ఎదురుచూసిన ఎమ్మెల్యే ఎంపీడీఓ వెంకటరమణ ను వాలంటరీలు ఎక్కడ అని ప్రశ్నించారు.వాలంటీర్లు ఫోన్ ఎత్తడం లేదని ఎంపీడీఓ సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.నంద్యాల జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి విషయం తెలిపారు. గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెను తిరిగారు. దీనంతటికీ గ్రామంలోని వైసీపీలోనే మరో వర్గానికి చెందిన స్థానిక నేత వాలంటీర్లను కట్టడిచేసి ఎమ్మెల్యే గడపగడప కార్యక్రమంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేసినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వానికి సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ రెండు కళ్ళు అని రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కానీ వైసీపీ లోని నాయకుల మధ్య నెలకొన్న రాజకీయ వర్గ విభేదాలు వైసీపీ ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. చివరికి ప్రభుత్వం చేపట్టిన గడపగడప ను వాలంటరీలు బహిష్కరించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వాలంటరీలకు రూ.5 వేలు గౌరవ వేతనం చెల్లిస్తుంది. ప్రభుత్వ కార్యక్రమాని బహిష్కరించిన సంఘటన పైన జిల్లా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
మండల అధికారులపై జిల్లా అధికారులకు ఫిర్యాదు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని వాలంటరీలు బహిష్కరించిన సంఘటనకు బాద్యులైన పగిడ్యాల ఎంపీడీఓ పై చర్యలకు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్థర్ అన్నారు . వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్థర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాభివృద్ధిని వాలంటరీలు అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు.గడపగడప కార్యక్రమం విషయం లో నిర్లక్ష్యంగా వ్యహహరించిన
మండల అధికారులపై జిల్లా కలెక్టర్, జడ్పీ సీఈఓ లకు ఫిర్యాదు చేశామన్నారు. ఎంపీడీఓ పైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.
సంఘటన పట్ల వైసీపీ ప్రభుత్వం సీరియస్..
రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గడపగడప ను బహిష్కరించిన వాలంటరీలపైన , నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీఓ పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరించిన వాలంటరీలను తొలగించాలని భావిస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. ఎంపీడీఓ కు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

About Author