NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి

1 min read

పట్టిసంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష

జాయింట్ కలెక్టర్ డా:ఎం.జె. అభిషేక్ గౌడ

ఏలూరు జిల్లా ప్రతినిది:న్యూస్ నేడు: పోలవరం మండలం పట్టిసం క్షేత్రంలోని శ్రీ భధ్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా  విస్త్రృత ఏర్పాట్లు చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.   పట్టిసీమ మహా శివరాత్రి ఉత్సవాల నిర్వహణపై మంగళవారం పట్టిసీమలో అధికారులతో జేసీ సమీక్షించారు.  ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ   పట్టిసం ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈనెల 14వ తేదీ నుండి  మూడు రోజులుపాటు జరిగే ఈ ఉత్సవంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా ఏర్పాట్లు ఉండాలన్నారు.  ఈ సందర్బంగా ఆయా శాఖల వారీగా నిర్ధేశించిన పనులు ఏ మేర పూర్తయింది సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.      మూడు రోజులుపాటు పట్టిసం క్షేత్రం పరిధిలో మద్యం షాపులను మూసివేసి ఉంచడంతోపాటు ఎక్కడా బయట మద్యం విక్రయాలకు తావులేకుండా గట్టి నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను జేసి ఆదేశించారు.   ఇసుకతెన్నులపై చలువ పందిళ్లు, స్నాన ఘట్టాల వద్ద మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకొనేందుకు నిర్మించిన తాటాకు గదులను ఏర్పాటు చేయాలన్నారు.  సమావేశంలో ఐటిడిఏ పీఓ రాములు నాయక్,  ఆర్డీఓ రమణ, ఆర్టీసీ ఆర్ ఎం షబ్నమ్, దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author