పవర్ పేట రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు
1 min read

అన్ని శాఖల అధికారులతో సమన్వయo తో ప్రణాళికలు
ఏలూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే పవర్ పేట రైల్వేగేటు వద్ద నిర్మించే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికా బద్దంగా ముందుకు సాగితే అనుకున్న ప్రయోజనాలు పొందవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్ పేట రైల్వేగేటు వద్ద ఆర్వోబి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ ఖరారు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలనను గురువారం నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసి విజయవాడ జోన్- 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్‌తో పాటూ వివిధ శాఖల అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలన జరిపారు. పవర్ పేట స్టేషన్ ప్రాంతంలోని రైల్వేగేటు మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. అయితే ఇటుగా రైళ్ళు వెళ్ళిన సమయంలో గేటు మూసివేయడం, తిరిగి తెరిచేంత వరకూ వాహనాలు బారులు తీరడం వెరసి అక్కడ ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగానే మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి రైల్వే అధికారులను అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగకరమైన ఈ ఆర్వోబి నిర్మాణం విషయంలో అన్నిశాఖల అధికారులు చురుగ్గా వ్యవహరించాలని సాధ్యమైనంత వరకు గేటు పరిసర ప్రాంత నివాసులకు నష్టం జరగకుండా చూడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీవో అచ్యుత అంబరీష్, తహశీల్దార్ గాయత్రీ దేవి, రైల్వే, ఆర్‌అండ్‌బి, రెవెన్యూ, కార్పొరేషన్ టౌన్ అధికారులు పాల్గొన్నారు.

