NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశైల జలాశయం నుంచి వచ్చే నీరు కేవలం తాగునీటి అవసరాలకే

1 min read

మూడు రిజర్వాయర్లకు నీటి నింపుదల తాగునీటి కోసమే

తాగునీటికి తొలి ప్రాధాన్యత…జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు : శ్రీశైలం జలాశయం నుంచి జిల్లాకు రానున్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసమే వినియోగించనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి వచ్చే నీటితో జిల్లాలోని మూడు రిజర్వాయర్లను తాగునీటి అవసరాల మేరకే నింపనున్నట్లు తెలిపారు. ప్రాంతానికి అనుకూలమైన పంటల ఎంపికపై రైతులకు శాస్త్రీయ సూచనలు, సాంకేతిక సహకారం అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

‘రైతన్నా నీకోసం – ఎల్‌నినో కాంబ్యాట్’ ద్వారా అవగాహన

‘రైతన్నా నీకోసం – ఎల్‌నినో కాంబ్యాట్’ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ పంటలు, నీటి పొదుపు, తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుపై ప్రతి రైతుకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయిలో రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నిరంతరం సలహాలు, సూచనలు అందించాలన్నారు. జిల్లాలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని కలెక్టర్ స్పష్టం చేశారు. శ్రీశైలం నుంచి వచ్చే నీటిని సాగునీటికి కాకుండా కేవలం తాగునీటి అవసరాలకే వినియోగించనున్నందున ప్రజలు, రైతులు నీటిని పొదుపుగా వినియోగించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికతో నీటి నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

About Author