జీవకోటికి ‘నీరు’ ప్రాణాధారం
1 min readభూగర్భజల శాఖ ఉపసంచాలకులు పి. విద్యాసాగర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: సృష్టిలోని ప్రతి జీవికి నీరే ప్రాణాధారమని భూగర్భజల శాఖ ఉపసంచాలకులు పి. విద్యాసాగర్ అన్నారు. మార్చి 22న ప్రపంచ జలదినోత్సవంను పురస్కరించుకుని ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో నీటి ఆవశ్యకత, విలువను విద్యార్థులు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్, ఎస్ఏపీ క్యాంపులో 10వ తరగతి విద్యార్థులకు భూగర్భజల ఆవశ్యకత, సంరక్షణ, పొదుపు తదితర అంశాలను డీడీ విద్యాసాగర్ వివరించారు. భూగర్భ జలశాఖ ఆవిర్భావించి 50 సంవత్సరాలు పూర్తి అయినందుకు స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో భూగర్భజల శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.