NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బట్టమేక పక్షులు ఉండటం మన అదృష్టం..

1 min read

ఎమ్మెల్యేలు జయసూర్య,గౌరు చరితా రెడ్డి.

మిడుతూరు, న్యూస్​ నేడు: బట్టమేక పక్షులు మన ప్రాంతంలో ఉండటం మన అదృష్టమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామంలో బట్టమేక పక్షుల అభయారణ్యంలో శుక్రవారం ఉదయం సొసైటీ బస్టర్డ్ రికవరీ పోగ్రామ్ ప్రెసిడెంట్ మాండ్ర లింగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్టర్డ్ రికవరీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి,నందికొట్కూరు ఎమ్మెల్యే మరియు(బిఎన్ హెచ్ఎస్)బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్ సుర్జీత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయసూర్య మాట్లాడుతూ కొన్ని కారణాలవల్ల ఇక్కడ పక్షులు అంతరించిపోయాయని పక్షులను ఇక్కడ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వస్తువుల్లోనూ పేదలకు మహిళలకు జీఎస్టీ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని జిఎస్టి ధరలను తగ్గించడంతో రాష్ట్రానికి 8 వేల కోట్ల నష్టం జరుగుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు.ఈనెల 16వ తేదీన నన్నూరు రాగమయూరి దగ్గర జరిగే ప్రధాని బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆమె కార్యకర్తలను కోరారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు, రేంజర్ కృష్ణ ప్రసాద్,వంగాల శివరామిరెడ్డి,సర్పంచ్ వెంకట రామిరెడ్డి, రామస్వామి రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,సుధాకర్ రెడ్డి,సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు.

About Author