PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“మ‌మ్మ‌ల్ని ఒక వెంట్రుక గానీ.. ఈక గానీ పీక‌లేరు“ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని పవన్‌ గుర్తించాలన్నారు. సభలు పెట్టడం, ప్యాకేజీ మాట్లాడుకోవడం పవన్‌కు అలవాటే అని విమర్శించారు. పవన్ అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. దమ్ముంటే పవన్‌ ఒంటరిగా పోటీ చేయాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ‘‘నా జోలికి వస్తే క్షమించేది లేదు, మేము చూస్తూ ఊరుకొనేది లేదు.. మీ నాయకులు, కార్యకర్తలు మా ఇంటిపైకి వస్తే చూస్తూ ఊరుకొము. చేతులు ముడుచుకు కూర్చొము. మళ్ళీ చెపుతున్న మమ్మల్ని కాకినాడలో ఒక వెంట్రుక గాని, ఈక గాని పీకలేరు’’ అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

                                     ``  

About Author