అమరులైన పోలీసుల త్యాగాలను మరువలేము
1 min read– ఎస్సై శ్రీనివాసులరెడ్డి
పల్లెవెలుగు , వెబ్ చెన్నూరు: విధి నిర్వహణలో ఊపిరే త్యాగము గా, శాంతి భద్రతల విషయంలో అసువులు బాసిన ‘పోలీస్ అమర వీరుల త్యాగాలు ల ఎన్నటికీ మరచిపోలేని ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. శుక్రవారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు పోలీస్ స్టేషన్ వద్దనుండి, పాత బస్టాండ్ వరకు విద్యార్థులు, తమ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా ఎస్ ఐ శ్రీనివాసులు రెడ్డి, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడుతూ, విద్యార్థులు చిన్న వయసులోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు, అంతేకాకుండా మంచి క్రమశిక్షణ తో చదివినట్లయితే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో నిలబడ గలరని, అలాగే తమ తల్లిదండ్రుల, గురువుల రుణం కూడా తీర్చు కోగలరని ఆయన తెలిపారు, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని ఆయన తెలియజేశారు, ప్రజలకు శాంతి భద్రత విషయంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారని, అలాంటి సమయంలో వారు అనేక ఆటుపోట్లకు గురైనప్పటికీ కూడా ప్రజల కొరకు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి బాధ్యతాయుతంగా విధినిర్వహణలో పాటు పడతారని ఆయన విద్యార్థులకు తెలియజేశారు, అనంతరం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర వీరులకు వారు రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వై, ఆల్ఫ్రెడ్, కె, నాగరాజు, భార్గవ, ఉపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, రంగనాయకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.