NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏఐవైఎఫ్ జిల్లా నిర్మాణ మహాసభలలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  గ్రామీణ ప్రాంతాలలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలకు యువత సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గౌడ్ యువతకు పిలుపునిచ్చారు. బుధవారం ఏఐవైఎఫ్ మండల జనరల్ బాడీ సమావేశం పత్తికొండ సిపిఐ కార్యాలయంలో మండల కార్యదర్శి సిద్దు అధ్యక్ష్యత జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా జిల్లా అధ్యక్షులు శ్రీరాములు గౌడ్  మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు, ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, చదువు పూర్తి చేసుకున్న యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారని, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని గాలికి వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి చూపించని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలనుండి ఇవ్వకుండా నిరుద్యోగుల గొంతు నొక్కుతూన్నారని వారు వాపోయారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైనటువంటి ఆలూరు నియోజకవర్గంలో పంటల పరిరక్షణ కోసం జింకల పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి,వాటిని విస్మరించి యువతను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.కావున ప్రభుత్వాలపై పోరాటానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు హనుమేష్ మాట్లాడుతు అక్టోబర్ 3న జరిగే నిర్మాణ మహాసభలో జిల్లా అభివృద్ధికి అనేక తీర్మాణాలు చేసి భవిష్యత్ పోరాటం నిర్వహిస్తామని కావున యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా సమితి సభ్యులు పెద్దయ్య, ఉపేంద్ర ఆచారి, అల్తాఫ్, రవి, జనార్దన్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *