రాజకీయాలకు అతీతంగా ప్రగతికి పాటుపడాలి
1 min read

నగరపాలక సర్వసభ్య సమావేశంలో మంత్రి టీజీ భరత్
రూ.29.58 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
నగరపాలక సంస్థ/కర్నూలు;
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మేయర్ బి.వై. రామయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి, కమిషనర్ పి.విశ్వనాథ్ హాజరయ్యారు. 31 అజెండా అంశాలపై చర్చించారు. రూ..29.58 కోట్ల నిధుల ఖర్చుకు పచ్చజెండా ఊపారు. పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. అజెండా అంశాలపై చర్చించి, పలు సూచనలు చేశారు. ఇటివల సంతోష్ నగర్ వద్ద ప్రధాన పైప్లైన్ లీకేజీల కారణంగా తాగునీటి సరఫరాకు ఏర్పడిన ఆటంకాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని, అభివృద్ధి పనులను జాప్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. నగరాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. కాగా అనివార్య కారణాల వల్ల సభ వాయిదా పడింది.
ఆమోదించిన తీర్మానాల్లో కొన్ని..15వ ఆర్థిక సంఘం 2023-24 రెండో విడత కింద రూ.16,26,98,725/- కోట్లతో అభివృద్ధి పనుల ప్రణాళికను ఆమోదించారు.మునగాలపాడు 15 యంఎల్డి నందు ప్రతిరోజు బ్యాక్ వాష్ చేయుటకు, ఆలమ్ & క్లోరిన్ రా వాటర్ & క్లియర్ వాటర్ నిర్వహణకు రూ.1.09 కోట్లు కేటాయించారు.2వ వార్డ్ ఖల్లా వీధి నందు సిసి రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయింపు. 4వ వార్డు మంగలి వీధి నందు కమ్యూనిటీ హాల్ రూ.50 లక్షలు మంజూరు.5వ వార్డ్ ఓల్డ్ ఈద్గా, బాంబో స్ట్రీట్ , కుమ్మరి స్ట్రీట్ నందు సిసిరోడ్లు, సిసి డ్రైన్లు రూ.50.00 లక్షలు కేటాయింపు.50వ వార్డు కొత్తపేట నందు పైపు లైన్ వేయుటకు రూ.30 లక్షలు కేటాయింపు. 19వ వార్డు మారుతి నగర్ నందు రూ.50 లక్షలతో సిసి రహదారి నిర్మాణానికి ఆమోదం. 19వ వార్డు సోమిశెట్టి నగర్ నందు సిసి రహదారి నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయింపు. 20వ వార్డు నందు వాసవి నగర్, జయరాం నగర్ సిసి రహదారి నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయింపు. 21వ వార్డు ఎఫ్సిఐ కాలనీ 1, 2 ప్రాంతాల్లో డబ్లూబియం రహదారుల నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయింపు.



