NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిధుల  సద్వినియోగం సక్రమంగా ఉపయోగించాలి…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. శామ్యూల్ పాల్ గారు కర్నూలు జిల్లాలోని మండల విద్యాధికారులకు, పీఎం శ్రీ స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయులకు, కేజీబీవీ ప్రిన్సిపాల్ కు మండల అకౌంటెంట్స్ కు సమీక్ష సమావేశం జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరిగింది పీఎం శ్రీ  స్కూల్స్ కు మరియు ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన నిధులను సక్రమమైన రీతిలో వినియోగించుకొని బిల్లులు సత్వరమే అప్లోడ్ చేయవలసిందిగా అందరూ ప్రధాన ఉపాధ్యాయులను మండలం విద్యాధికారులను ఆదేశించడం జరిగింది, ఉపాధ్యాయుల హాజరు మరియు విద్యార్థుల హాజరు 100% నమోదయ్యేటట్టు చూడవలసిన బాధ్యత మండల విద్యాధికారులు మరియు ప్రధాన ఉపాధ్యాయుల ముఖ్య విధి అని పేర్కొనడం , మండల విద్యాధికారులు తమ పర్యవేక్షణలు చేసే ప్రతి చోట విద్యార్థుల  సామర్ధ్యాలను పరీక్షించాలన్నారు  సమీక్ష సమావేశంలోపాల్గొన్న  మండల విద్యాధికారులతో,ప్రధానోపాధ్యాయులతో (హెచ్​ఎంఎస్​) , కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ప్రధాన ఉపాధ్యాయులతోఆయన సంభాషించారు.ఆయన ప్రసంగంలో ఉపాధ్యాయ తరగతుల పర్యవేక్షణ, విద్యా కార్యకలాపాలు, ఎస్​ఎంసి సభ్యులతో సంబంధాలు, అభ్యాస ఫలితాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను ప్రోత్సహించడం, ఉత్తమ పద్ధతులను కనుగొనడం మరియు నెమ్మదిగా నేర్చుకునేవారికి మద్దతు ఇవ్వడం వంటి అంశాలు ఉన్నాయి ఈ సమీక్ష సమావేశ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ సెక్టోరియల్ ఆఫీసర్లు, డాక్టర్ షేక్ రఫీ, డాక్టర్ వై ధనరాజ్, ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ సురేంద్ర బాపూజీ, సమగ్ర శిక్ష ఈఈ శ్రీనివాసులు , అసిస్టెంట్ ఇంజనీర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మేఘశ్యామ్  ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author