క్రీస్తు యేసు చెప్పిన ప్రేమ, శాంతి, సహనం మార్గంలో జీవించాలి
1 min read
ఫాదర్ విజయరావు “గుడ్ ఫ్రైడే” సందేశం
చెన్నూరు, న్యూస్ నేడు: మానవాళి చేసిన పాపాలకు బదులుగా ఏసుక్రీస్తు సిలువను మోసి, ఆయన తలపై ముళ్ళ కిరీటం ధరించి, కొరోడా దెబ్బలు తట్టుకొని, మనకోసం తన రక్తాన్ని చిందించి మనందరి కోసం మరణించారు. అలాంటి ప్రభువు చూపిన మార్గంలో క్రైస్తవులమైన మనమందరం జీవించాలని ఫాదర్ విజయరావు క్రైస్తవులను ఉద్దేశించి ప్రసంగించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చెన్నూరు ఆర్ సి ఎం చర్చి ఫాదర్ విజయరావ్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరి, సోదరులు భక్తి శ్రద్ధలతో ఏసుక్రీస్తు కీర్తనలతో యేసు సిలువ మార్గం నిర్వహించారు. ఏసుక్రీస్తు బైబిల్ నందు చెప్పిన విధంగా ఏడు మాటలను ఆయన క్రైస్తవులకు పూజించడం జరిగింది. మొదటి మాట తండ్రి మీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక క్షమింపుము, రెండో మాట నేడు నీవు నాతో కూడాపర ధైసులో ఉంటావు, మూడో మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి, అంటూ తన తల్లి బాధ్యతను తన శిష్యులలో ఒకరైన యెహోవానుకు అప్పగించడం, నాలుగో మాట, నా దేవా ,నా దేవా నన్ను ఎందుకు విడిచి వేశావు, ఐదో మాట నాకు దాహంగా ఉంది అంటూ జీసస్ చెప్పడం జరిగింది, ఆరో మాట సాధించితిని అంటూ యేసు తన ఆరో మాటగా చెప్పారు. చివరి ఏడో మాట, తండ్రి నా ఆత్మను నీ చేతులలోకి అప్పగించుచున్నాను. క్రైస్తవులైన మనమందరం కూడా ఏసుక్రీస్తు చూపినటువంటి ప్రేమ శాంతి విశ్వాసం నమ్మకం వంటి బాటలలో నడవాలని ఆయన క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే సందేశాన్ని వివరించారు. ఏసుక్రీస్తు తిరిగి మళ్లీ పునరు జీవం చెందుతారని దానిని క్రైస్తవ విశ్వాసులు అందరు కూడా ఈస్టర్ గా పండుగను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కాగా సిలువ మార్గంలో ఏసుక్రీస్తు వేషధారణలో జేస్టాది కుమార్ బాబు, బటులుగా కొత్త గాంధీనగర్ యువకులు, సిలువ యాగాన్ని నిర్వహించారు. కార్యక్రమం క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.