గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనే ధ్యేయంగా పని చేయాలి
1 min read– అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలి
– ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నిరుపేదలకు పారదర్శకంగా అందే టట్లు చూడాలి
– పేదరిక నిర్మూలనే ద్యేయంగా ప్రభుత్వాలు పని చేయాలి
– స్వాతంత్ర్య సమరయోధులు పెడబల్లె బాల యల్లారెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ద్వేయంగా పనిచేయాలని, అప్పుడే గ్రామాలలోని ప్రజలు స్వేచ్ఛాయుతంగా పచ్చని పంటల తో పశు సంపదతో చల్లగా ఉంటారని స్వాతంత్ర్య సమరయోధులు పెడ బల్లె బాల యల్లారెడ్డి అన్నారు, ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, 77 ఏళ్ల స్వతంత్ర భారత వనిలో నేటికీ పేదరికం పెళ్లబుకుతోందని దీనిని అధిగమించాలంటే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం తోనే సాధ్యమని ఆయన అన్నారు, ఇప్పటికే ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు, ఇప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశన పయనిస్తున్నాయని, ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం సంతోషకరమన్నారు, ఈ గ్రామ సచివాలయ వ్యవస్థతో పేదరిక నిర్మూలనకు దోహదపడతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు, 102 ఏళ్లలో కూడా ఇంకా తన పనులు తాను చేసుకుంటున్నానని ఆయన తెలిపారు,
స్వాతంత్ర్య ఉద్యమంలో:- దేశం పైన ప్రేమతో తెల్ల దొరలపై తాము చేసిన పోరాటాలతో జైలు శిక్ష అనుభవించడం జరిగిందన్నారు, రోజుల్లో తెల్ల దొరల ఆగడాల కు హద్దె లేదని, వారి ఆగడాలు అరికట్టడంలో యువకుడిగా తన వంతు పాత్ర పోషించడం జరిగిందని ఆయన తెలిపారు, భరతమాత పై ఉన్న అపారమైన ప్రేమతో, భక్తితో ఆప్పుడు యువకుల మైన మేము సమయతమై చెన్నూరు- కొండపేట మధ్య ఉన్న పెన్నా నది లో లెవెల్ కాజ్వెని తెల్లదొరలు దాటకుండా పగలగొట్టడం జరిగిందన్నారు, దీంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమ పై కేసు నమోదు చేసి జైల్లో ఉంచడం జరిగిందన్నారు,
జిల్లాలో బ్రతికి ఉన్న ఏకైక వ్యక్తిని:- స్వతంత్ర సమరయోధులలో జిల్లాలో తానొక్కడినే బ్రతికి ఉన్నానని ప్రస్తుతం నా వయసు(102) సంవత్సరాలని పెడబల్లె బాల యల్లారెడ్డి అన్నారు, అందుకే మరింత గౌరవం దక్కిందని ఆజాతిక అమృత్ మహోత్సవాలలో భాగంగా తనకు జిల్లా అధికారుల తో పాటు, ప్రజా ప్రతినిధులు కూడా ఘనంగా సత్కరించడం జరిగిందని తెలిపారు,
మహిళా సాధికార దిశగా సాగాలి:- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధికారత దిశగా పయనించాలని మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తే దేశ అభ్యున్నతికి ఎంతో దోహద పడినట్లు అవుతుందని ఆయనతెలియజేశారు, మహిళలు విద్యా, ఆర్థిక స్వాలంబన లభించినట్లయితే తమ కుటుంబమే కాకుండా, సమాజ శ్రేయస్సు కూడా బాగుంటుందని ఆయన అన్నారు,…..
అవినీతికి ఆస్కారం లేకుండా, పేదరిక నిర్మూలన కు పాటుపడాలి
ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి రహిత పాలన అందించాలని, అలాగే కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లయితే, పేదరిక నిర్మూలన అంతం మొoదించినట్లు అవుతుందని ఆయన అన్నారు, దీంతో భారతదేశం ఆర్థిక రంగాల్లో ప్రపంచ దేశాల్లో మొదటి స్థానంలో ఉంటుందని, ఆయన తెలిపారు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు కలగలిపిన భారత ఏ దేశం లో లేనటువంటి సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన కూడా అందరి సుఖశాంతుల తో విరజల్లుతున్న గొప్ప బావ చాలామన్న దేశం నా దేశమని ఆయన తెలిపారు.