ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ అరెస్టును ఖండిస్తున్నాం…
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హొళగుంద మండలంలో పార్టీ కార్యాలయం నందు పాత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఎస్డిపిఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ మా జాతీయ అధ్యక్షులు ఎంకే ఫైజీ ని అరెస్టును త్రీవంగా ఖండిస్తున్నాను అన్నారు. అసమ్మతిని అణిచివేసేందుకు, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈ అరెస్టు ప్రతీకార అని అన్నారు రాజకీయాలలో భాగం తప్ప మరొకటి కాదు.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మా జాతీయ అధ్యక్షులు ఎం. కె. ఫైజీని ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై తీవ్ర ఖండన వ్యక్తం చేశారు.తమ జాతీయ అధ్యక్షుడిని అరెస్టు చేయడం అసమ్మతి స్వరాన్ని అణిచివేసేందుకు కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రతీకార రాజకీయం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. తప్పుడు అభియోగాలు మోపడం మరియు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్య ప్రత్యర్థులను భయపెట్టడం మరియు అణచివేయడం పాలన యొక్క ఎజెండాలో భాగం. క్రూరమైన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రధాన స్రవంతిలో ఉన్న SDPI పట్ల పాలన అసహనంతో ఉందనడానికి ఈ అరెస్టు స్పష్టమైన సూచన అని అన్నారు. ఎస్డిపిఐ అటువంటి అణచివేత మరియు ప్రజావ్యతిరేక ఎత్తుగడలకు వ్యతిరేకంగా దాని పూర్తి స్థాయి మరియు స్ఫూర్తితో పోరాడటానికి కట్టుబడి ఉంటుందన్నారు.వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటం ఫలితంగాఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులైన ఎంకే ఫైజి ని కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులో అరెస్టు చేసేది అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నందేశవ్యాప్తంగా సాగిన పోరాటంతోకేంద్ర ప్రభుత్వానికి మప్పు వాటిల్లింది అందుకే తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారు అని అన్నారు ఈ కానీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ కార్యదర్శి కే సలాం మరియు హాఫీజ్ కోశాధికారి అల్లబకాష్ తదితరులు పాల్గొన్నారు.