PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … జిల్లా ఎస్పీ

1 min read

– స్పందన కార్యక్రమానికి  101   ఫిర్యాదులు .

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన … జిల్లా ఎస్పీ.జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన  ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ గారు మాట్లాడి వారి యొక్క సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 101   ఫిర్యాదులు వచ్చాయి.

వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …

1)పొలం అమ్ముతామని చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని మోసం చేశారని కల్లూరు, చింతలముని నగర్ కు చెందిన శ్రీహరి ఫిర్యాదు చేశారు.

2)నా కుమారుడి పెళ్ళి కొరకు బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాము. అయితే డబ్బులు కట్టిన తర్వాత బంగారం తిరిగి ఇవ్వకుండా బ్యాంకు వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓర్వకల్లు కు చెందిన నూర్ అహమ్మద్ ఫిర్యాదు చేశారు.

3) పెద్ద కుమారుడు , కోడలు కలిసి వృద్ద్యాపంలో ఉన్న తల్లిదండ్రులైన మమ్మల్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలని వేధింపులకు గురి చేస్తున్నారని కర్నూలు, చిదంబరావు వీధికి చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.

4)నాకు చెందిన 30 సెంట్ల భూమిని ఒక వ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని చర్యలు తీసుకోవాలని చిప్పగిరి మండలం , నగర డోణ  గ్రామానికి చెందిన గొల్ల రామకృష్ణ ఫిర్యాదు చేశారు.

5)ఒక వ్యక్తి  మమ్మల్ని నమ్మించి చాలా సంవత్సరాల నుండి చీటీల పేరుతో డబ్బులు కట్టించుకుని  తిరిగి డబ్బులు ఇవ్వకుండా  ఐపి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని  కర్నూలు చిత్తారి వీధికి చెందిన శ్రీదేవి ఫిర్యాదు చేశారు.

6)నా పొలంలోని కొంత భాగాన్ని ఒక వ్యక్తి తన పేరిట ఆన్ లైన్ లో ఎక్కించుకున్నారని చర్యలు తీసుకోవాలని  చిప్పగిరి మండలం , నగర డోణ గ్రామానికి చెందిన ఉప్పరి రామన్న ఫిర్యాదు చేశారు.స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్  హామీ ఇచ్చారు.ఈ స్పందన కార్యక్రమంలో  డిఎస్పీ యుగంధర్ బాబు , లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, సిఐలు పాల్గొన్నారు.

About Author