PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎవ్వరినీ వదిలిపెట్టం..

1 min read

–భయపడే చంద్రబాబుపై అక్రమ కేసులు -వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ఖాయం -అక్రమ కేసులు పెట్టడంపై టిడిపి నాయకులు ఫైర్

పల్లెవెలుగు వెబ్​ మిడుతూరు: మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన కేసులు మరియు టిడిపి కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవ్వరినీ కూడా వదలి పెట్టే ప్రసక్తే లేదని నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి అధికారులు మరియు నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు.చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించడం అంతే కాకుండా కోర్టు ఆయనను 14 రోజుల పాటు రిమాండ్ కు పంపుతూ రాజమండ్రి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.అందుకు గాను నిరసనగా టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో టిడిపి కార్యాలయం దగ్గర సామూహిక నిరాహార దీక్షను ఉ.10 నుంచి సా.5 గంటల వరకు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ముందుగా మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గతంలో 16 నెలల పాటు జైలలో ఉన్నాడని తన సొంత చిన్నాననే చంపించాడని మచ్చలేని చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో 36వ నిందితుడిగా చంద్రబాబును చేర్చారని ఆయనను జైలుకు పంపారని అంతే కాకుండా నారా లోకేష్ ను జైలుకు పంపాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని అందరిని జైలుకు పంపించి ఏకపక్షంగా అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి తహతహ లాడుతున్నారని నీ జాగీర్ కాదు నువ్వు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ఎవ్వరు నిన్ను నమ్మే స్థితిలో లేరని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.చంద్రబాబు జైల్లో ఉన్నంతా ప్రజల్లో ఇంకా అభిమానం పెరుగుతూ ఉందని వచ్చే ఎన్నికల్లో మేధావులు విద్యావంతులు మహిళలు యువకులు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృత నిశ్చయంతో ముందున్నారని అన్నారు.జగన్ అరాచకాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఈ సైకో ముఖ్యమంత్రి ఇసుక ట్రాక్టర్ వెయ్యి రూపాయలు చేశాడని చంద్రబాబును జైలుకు పంపడానికి అధికారులకు ఎన్ని కోట్లు ఇచ్చాడోనని ముఖ్యమంత్రి జగన్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య మాట్లాడుతూ చంద్రబాబుకు 72 సంవత్సరాల వయస్సు 42 సంవత్సరాల రాజకీయ అనుభవం గల సైకో జగన్ ఏమి చేస్తున్నాడో ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన అన్నారు.ప్రతి నెలా జనవరిలో జాబ్ కార్డు ఇస్తామని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన మాట ఏమైందని కాకరవాడ చిన్న వెంకటస్వామి ప్రశ్నించారు.తర్వాత ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మాణిక్యరాజు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలపై పోలీసులను పంపించి అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారని మీకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని ఆయన విరుచుకు పడ్డారు.అనంతరం నందికొట్కూరు మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డి,పగిడాల మహేష్ నాయుడు మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుల్తాన్ అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి, మాజీ సర్పంచులు వెంకటేశ్వర రెడ్డి,నాగేంద్రుడు,నాయకులు చాకర్ వలి,సుభాన్,సర్వోత్తమ రెడ్డి,లక్ష్మీనారాయణ,సుధాకర్ యాదవ్,గోకారి,సోపి సాహెబ్,శివ తదితరులు పాల్గొన్నారు.

About Author