NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమస్యలు పరిష్కరిస్తాం..

1 min read
ప్రచారం చేస్తున్న ఎన్​డబ్ల్యూపీ వ్యవస్థాపకురాలు శ్వేతాశెట్టి

ప్రచారం చేస్తున్న ఎన్​డబ్ల్యూపీ వ్యవస్థాపకురాలు శ్వేతాశెట్టి

– ఇండిపెండెంట్​ అభ్యర్థుల గెలుపు.. ఎన్​డబ్ల్యూపీ లక్ష్యం
– ఎన్​డబ్ల్యూపీ వ్యవస్థాపకురాలు శ్వేతాశెట్టి
పల్లెవెలుగు, కర్నూలు
ఈ నెల 10న జరగనున్న కార్పొరేషన్​ ఎన్నికల్లో ఎన్​డబ్ల్యూపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్​ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ వ్యవస్థాపకురాలు శ్వేతాశెట్టి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆది,సోమవారాలలో ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం నేతృత్వంలో ఆమె 15, 47,48 వార్డుల ఇండిపెంంట్​ అభ్యర్థుల గెలుపు కోసం పర్యటించారు. ఈ సందర్భంగా శ్వేతాశెట్టి మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ… ప్రజా సమస్యలు పరిష్కరించడంతోపాటు మహిళల్లో చైతన్యం తీసుకురావడంలో తమ అభ్యర్థులు ముందుంటారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు పప్పు..బెల్లంలా సంక్షేమ పథకాల రూపంలో నిధులు వెలజల్లుతోందని ఆరోపించిన శ్వేతాశెట్టి… మున్సిపల్​, కార్పొరేషన్​ ఎన్నికల్లో ఆ పార్టీకి అజెండా అంటూ ఏమీ లేదన్నారు. తమ పార్టీ మద్దతు ఇచ్చిన 15 వార్డు శవల మహదేవమ్మ, 47వ వార్డు జెరదొడ్డి నర్సమ్మ, 48 వ వార్డు భాస్కరమ్మను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు హసీనాబేగం, నేషనల్ ఉమెన్స్ పార్టీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఎన్.మేరీ, కొత్తపేట ఇంచార్జ్ ప్రసన్న ,యూత్ ప్రెసిడెంట్ ఇంతియాజ్, కార్యకర్తలు విజయమ్మ, ఎస్.సుజాత, బి.సుజాత, పి.సురేఖ, సిమ్రాన్, అనిత పాల్గొన్నారు.

About Author