సంక్షేమమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం
1 min read– ఏలూరు కార్పొరేషన్ 29వ డివిజన్ టైటాస్ నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం విజయవంతం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎంతో పారదర్శకంగా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ మరింత చేరువచేసేలా స్థానిక నాయకులు మరింత చేరువు చేసేలా మరియు చేపట్టిన నువ్వే మా నమ్మకం జగనన్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేక చొరవ చూపి విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆళ్ళ నాని తెలిపారు. ఏలూరు కార్పొరేషన్ 29వ డివిజన్లోని టైటాస్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ ఉచ్చుల సుజిత సన్నీ ఆధ్వర్యంలో జరిగిన స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసనసభ్యులు, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ ఉచ్చుల సుజిత సన్ని దంపతుల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు డివిజన్ మహిళలు ప్రజలు ఆళ్ల నానికి భారీ గజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనను క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ చేరువ చేయాలని, రాబోయే రోజుల్లో నువ్వే మా నమ్మకం జగనన్న అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న పారదర్శక సంక్షేమ పాలనను ప్రజలకు వివరించడంలో ఆయా క్లస్టర్ల గృహ సారధులు కీలక పాత్ర పోషించాలని ఆళ్ల నాని సూచించారు. అదేవిధంగా ఆయా క్లస్టర్లలోని అర్హులైన పేద ప్రజలకు ఏదైనా కారణాలతో సంక్షేమ పథకాలు అందకపోతే వారి సమస్యను పరిష్కరించి, వారి వారికి కూడా జగనన్న అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని ఆళ్ళ నాని సూచించారు. ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ చైర్మన్ మంచెo మైబాబు, మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు బలరాం, కో-అప్షన్ సభ్యులు SMR పెదబాబు, మున్నుల జాన్ గురునాధ్, ఏలూరు టూటౌన్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అమీనా అన్సారీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహ్మద్ రియాజ్ అలీ ఖాన్, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల రమేష్, తుమరాడా స్రవంతి, పొలిమేర దాసు, దేవరకొండ శ్రీనివాస్, ఇమ్మానియేల్ జయకర్, లీగల్ సెల్ నాయకులు ప్రత్తిపాటి తంబీ, వైఎస్సార్ సిపి నాయకులు పొలిమేర హరికృష్ణ, జిజ్జువరపు రమేష్, నున్న కిషోర్, కీలాడి దుర్గారావు, బండారు కిరణ్, నిడికొండ నరేంద్ర, శివరావు, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్ , లుటుకుర్తి సుభాష్, మోదుగు పుల్లారావు, పిట్టా ధనుంజయ్, , భారతి వెంకట రావు, బోగిశెట్టి పార్వతి, వితాల చంద్రశేఖర్, సహా పలువురు నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన గృహసారధులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.