ఇంటింటా సంక్షేమ కాంతులు: ఎమ్మెల్యే
1 min read– అభివృద్ధిలో ఆదర్శంగా గ్రామాలను తీర్చిదిద్దుతాము
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటా సంక్షేమ పథకాల కాంతులు విరాజిల్లుతున్నాయని ,అభివృద్ధి లో ఆదర్శంగా గ్రామాలను తీర్చిదిద్దుతామని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో సోమవారం సర్పంచ్ మాధవరం సుశీలమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు తొగురు ఆర్థర్ పాల్గొన్నారు. “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక -ఆదర్శ పాలన సాగిస్తున్నారని, ఎక్కడా కూడా కులాలు చూడకుండా మతాలు చూడకుండా, పార్టీ లు చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విలువను విశ్వసనీయతతో కూడిన పరిపాలన చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఇచ్చిన హామీలలో 98 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అందుకే ప్రజల హృదయాల్లో ఉత్తమ స్థానం సంపాదించుకున్నారన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి కొమ్ము కాయకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు ,ప్రజా సమస్యలను విన్నవించగానే తక్షణమే స్పందిస్తూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మనం ఎల్లప్పుడూ తోడుగా నిలవాలని కోరారు. గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ పాఠశాల విద్యార్థులు తెలుగు నెలలు, వారాలు, ఎబిసిడి లు కూడా చెప్పకపోవడంతో ఉపాధ్యాయుల పై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్ బాబు, ఎంపీడీఓ శోభా రాణి, విద్యుత్ శాఖ ఏడీఏ శ్రీనివాస రెడ్డి, ఏఈ రాము నాయక్, మండల వ్యవసాయ అధికారి శ్రావణి, పశు వైద్యాధికారి నిర్మలా దేవి, హౌసింగ్ ఏఈ అరుణ్, ఇఓఆర్ పిడి సుబ్రహ్మణ్యం శర్మ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ నజ్మా, నందికొట్కూరు రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ లు హరి సర్వోత్తమ రెడ్డి, సగినేల ఉసేనయ్య ,వైసీపీ నాయకులు మాధవరం ఏసు రత్నం, మాధవరం రత్నం, సంజన్న, వేల్పుల నాగన్న, మాజీ పోలీస్ అధికారి జయ చంద్ర, మహిళ నాయకురాలు డా.వనజ, వేల్పుల జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.