ప్రజల వద్దకే సంక్షేమ పాలన.. ఎమ్మెల్యే గంగుల
1 min read– మృతుడి తల్లికి సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గంగుల
పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: ప్రజల వద్దకే సంక్షేమ పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బుధవారం రుద్రవరం రెడ్డిపల్లె తువ్వపల్లె గ్రామాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను చదివి వినిపించి కరపత్రంలోని సంక్షేమ పథకాలు అందాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారి వివరాలను తెలుసుకొని వారికి సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన గ్రామస్తులు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. స్పందించినాయన గ్రామస్తులకు త్రాగునీటి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు వివరించిన సమస్యలపై సావధానంగా విని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే గడపగడపకు కార్యక్రమం చేపట్టామని ఇందులో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుటాలమ్మ క్షేత్రం చైర్మన్ ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకులు గంగుల మనోహర్ రెడ్డి ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం రాఘవరెడ్డి వైసిపి సీనియర్ నాయకుడు గంగిశెట్టి తిమ్మయ్య శెట్టి ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి తహసిల్దార్ వెంకట శివ ఏఈలు వెంకట రాముడు గంగుల రాఘవేందర్ రెడ్డి ప్రమోద్ జాకీర్ హుస్సేన్ బైరి బ్రహ్మం నంబర్ వన్ హుసేని గపూర్ సాహెబ్ కొల్లం పుల్లయ్య నరసాపురం ప్రసాద్ రెడ్డి ఆలమూరు పాణ్యం చంద్ర పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు పోలీసులు సచివాలయం సిబ్బంది వెలుగు సిబ్బంది ఉపాధి సిబ్బంది వైద్య సిబ్బంది గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
రూ రెండు లక్షల సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
రుద్రవరం గ్రామానికి చెందిన నాగమ్మ దంపతులకు సీఎం సహాయ నిధి కింద రూ రెండు లక్షల చెక్కును ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి బుధవారం అందజేశారు. గ్రామానికి చెందిన నాగమ్మ కుమారుడు సురేష్ గత ఏడాది తెలుగు గంగ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం సీఎం సహాయనిధి కింద రూ రెండు లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది. గడపగడప కార్యక్రమంలో భాగంగా మృతుడు సురేష్ తల్లిదండ్రులకు ఎమ్మెల్యే గంగుల సీఎం సహాయనిధి కింద మంజూరైన రెండు లక్షల చెక్కును అందజేశారు.