సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలుపు తథ్యం..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చెరుకుచెర్ల గ్రామంలో పల్లెకు పోదాం అనే కార్యక్రమం మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినది.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈసందర్భంగా వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఉపయోగపరమైన పనులు ఈ ప్రభుత్వంలో జరిగాయని అంతేకాకుండా చరిత్రలో ఎన్నడూ ఎరుగని విప్లవాత్మక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారంటూ జగనన్న ప్రభుత్వం వచ్చాక మీకు ఏమేమి పథకాలు అందాయని అక్కడున్న ప్రజలను జెడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి అడిగారు. పథకాలు అందిన వివరాల గురించి సభలో ప్రజలు మాట్లాడారు.సభలో ఎస్సీ కాలనీలో నీటి కుళాయిలు లేవని వాటిని ఏర్పాటు చేయాలని త్వరగా వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని జెడ్పిటిసి అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో గెలుపు తథ్యం అనినాయకులు అన్నారు.ఈ రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి అనే బుక్ లెట్ ను నాయకులు ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,గ్రామ సర్పంచ్ మరియమ్మ,జెసిఎస్ మండల కన్వీనర్ బి.రవికుమార్,మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్నమల్లారెడ్డి, సహకార సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,పంచాయతీ కార్యదర్శి షఫీ,మల్లు శివ నాగిరెడ్డి, కలమందలపాడు మహబూబ్ బాష,అన్వర్ భాష,గోపాల్ రెడ్డి మరియు వివిధ గ్రామాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.