‘మా’ ఎన్నికలతో మాకు ఏమవసరం? మంత్రి పేర్నినాని
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరుగుతోన్న ‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)ఎన్నికలతో ప్రభుత్వానికి ఏమీ అవసరమని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ఈమేరకు ‘మా’ ఎన్నికలతో మాకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈమేర వెల్లడించారు. మూవీ ఎన్నికల్లోకి వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలను లాగుతారా… అని నటుడు ప్రకాశ్‌రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యాలకు మంత్రి పేర్నినాని స్పందించారు. ‘మా’ ఎన్నికలతో సీఎం జగన్‌కు గాని, ప్రభుత్వానికి గాని ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మూవీ ఎన్నికలు ఈనెల 10న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు మంచువీష్ణు, ప్రకాశ్‌రాజ్ ప్యానళ్లు పోటాపోటీగా చిత్రపరిశ్రమలో ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఓవైపు పరస్పర మాటల యుద్ధం చేస్తూనే… మరోవైపు గెలుపుపై ఎవరీధీమా వారు వ్యక్తం చేస్తూ ముందుకెళుతున్నారు.