భారత దేశ అప్పు ఎంత అంటే ?
1 min readపల్లెవెలుగు వెబ్ :భారత దేశ అప్పు గత 70 ఏళ్లలో 5.29 లక్షల శాతం పెరిగిందని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2014-15 బడ్జెట్ నాటికి దేశ అప్పు 62,42,220.92 కోట్లు ఉండగా.. 2021-22 నాటికి 1,35,86,975.52 కోట్లకు చేరింది. 64 ఏళ్లలో దేశం 62.42 లక్షల కోట్ల అప్పు చేయగా.. ఏడేళ్లలోనే కొత్తగా 73,44,754 కోట్లకు పెరిగింది. దశాబ్ధాల క్రితం చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఎఫ్సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన బకాయిలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఆ రాయితీల భారం 1,62,827 కోట్లకు చేరింది.