PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుడగజంగాలను ఎస్సీల్లో చేరుస్తామని చెప్పడం ఏంటి..?

1 min read

-దళిత ఎంపీ,ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం -ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి -మాల మహానాడు తాలుకా అధ్యక్షులు నాగేష్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: బుడగ జంగాల కులాలను దళిత కులాల్లో చేరిస్తే సహించే ప్రసక్తే లేదని నందికొట్కూరు మాల మహానాడు తాలూకా అధ్యక్షులు నాగేష్ అన్నారు.బుధవారం మిడుతూరు మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెల 26వ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో బుడగ జంగాల కులస్తులను దళిత కులాల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారని ఇది సరైన పద్ధతి కాదని ఈ తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అయ్యారని అంబేద్కర్ రాజ్యాంగం వల్ల మేము ప్రజా ప్రతినిధులం అయ్యాం అనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు.ఈ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు గాని ఈ విషయంపై స్పందించకపోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు.నేటికీ సమాజంలో నానా అవస్థలకు దళితులు గురవుతున్నారని గత 2019 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో దళితుల ఓట్లతోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కానీ ప్రభుత్వం దళితులకే వెన్నుపోటు పొడుస్తుందని ఈ విషయాన్ని దళితులందరూ గుర్తుంచుకోవాలన్నారు.బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చుతామని ప్రభుత్వం చెప్పడం ఈ విషయంపై ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వం భక్తుడు తీసుకువచ్చి వెనక్కి తీసుకునే విధంగా చూడాలని లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని అంతేకాకుండా వారు తమ తమ పదవులకు వెంటనే రాజీనామాలు చేసే విధంగా ఒత్తిడి తీసుకు వస్తామని ఆయన హెచ్చరించారు.వెనక్కి తీసుకొని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దళితులను చైతన్యవంతం చేసి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని తాలూకా అధ్యక్షులు నాగేష్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయ్,మనోహర్ కాంత్ చంద్రన్న పగిడాల మండల నాయకులు సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.

About Author