పిఆర్సి , డి ఎ బకాయిలు చెల్లింపు ఎప్పుడు? ..ఆపస్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : వేతన సవరణ మరియు డి ఎ బకాయిలు ఒక్కో ఉద్యోగికి లక్షల మేరకు చెల్లించాల్సి ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేకుండా ఉండడం సరికాదని, ఉద్యోగ సంఘాలతో సమావేశాలలో అనేకమార్లు చర్చించి విడతల వారీగా మొదటి విడత వాయిదా అక్టోబర్ 31 లోపు చెల్లిస్తామని స్పష్టమైన హామీలు కూడా ఇవ్వడం జరిగిందని అయితే ఇంతవరకు ఆ బకాయిలు చెల్లింపుకు ఆర్థిక శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, మరి ఎప్పుడు చెల్లిస్తారని, వీటితోపాటు సెప్టెంబర్ 30 లోపు చెల్లిస్తామన్న ప్రావిడెంట్ ఫండ్, ఏపీజిఎల్ఐ, సంపాదిత సెలవులు సంబంధించిన బిల్లులు కూడా గ్రీన్ ఛానల్ లోనే మగ్గుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల బకాయిలు చెల్లింపుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యోగుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి యస్ బాలాజీ లు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేకుండా చేరిన కాంట్రాక్టు లెక్చరర్స్ ను రెగ్యులర్ చేయడం ఏమాత్రం సరి కాదని, జిల్లా పరిషత్ మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.