ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 11న లేదా ఆ తరువాత ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కొంత మంది వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. జిల్లాల పునర్విభజన, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల్లో కొంతమంది మంత్రులు, సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి పెరగకముందే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేసి అసంతృప్తులకు పుల్‌స్టాప్ పెట్టాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమి. ఆ మరుసటి రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 17న ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.